నిర్మాత‌గా మారుతున్న నాగ‌చైత‌న్య‌

ABN , First Publish Date - 2020-02-26T00:47:42+05:30 IST

అక్కినేని కుటుంబం పేరు చెబితే నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున ఇత‌ర హీరోల‌తో పాటు గుర్తుకొచ్చేది అన్న‌పూర్ణ స్టూడియోస్‌.

నిర్మాత‌గా మారుతున్న నాగ‌చైత‌న్య‌

అక్కినేని కుటుంబం పేరు చెబితే నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున ఇత‌ర హీరోల‌తో పాటు గుర్తుకొచ్చేది అన్న‌పూర్ణ స్టూడియోస్‌. సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుండి హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణ‌మైన హీరోల్లో ముఖ్యుడైన ఏఎన్ఆర్‌.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు స్టూడియో వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇది కాకుండా కేవ‌లం నాగార్జున మ‌నం ఎంట‌ర్‌టర్ ప్రైజెస్ బ్యాన‌ర్‌ను ప్రారంభించాడు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ఓ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ త‌న బ్యాన‌ర్‌లో సినిమాలు నిర్మించాల‌ని చైత‌న్య భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రాజ్‌త‌రుణ్‌తో ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న ఈ వార్త‌ల‌పై అక్కినేని హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Updated Date - 2020-02-26T00:47:42+05:30 IST