హాలీవుడ్ ఆలోచనలో మురుగదాస్..?

ABN , First Publish Date - 2020-12-02T15:11:53+05:30 IST

తెలుగు, తమిళంలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించి స్టార్‌ డైరెక్టర్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఎ.ఆర్‌.మురుగదాస్‌ తదుపరి సినిమా ఏంటి? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

హాలీవుడ్ ఆలోచనలో మురుగదాస్..?

తెలుగు, తమిళంలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించి స్టార్‌ డైరెక్టర్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఎ.ఆర్‌.మురుగదాస్‌ తదుపరి సినిమా ఏంటి? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తాజా సమాచారం మేరకు మురుగదాస్‌ ఓ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ కోసం పనిచేయబోతున్నాడట. హాలీవుడ్ సినిమా అంటే ఏదో ఆషా మాషీ సంస్థలో చేసేస్తున్నాడని అనుకోకండి..భారీ నిర్మాణ సంస్థగా పేరున్న వాల్‌ డిస్నీ బ్యానర్‌లో మురుగదాస్‌ సినిమా చేయనున్నాడట. హాలీవుడ్‌లో రూపొందుతోన్న లైవ్ యాక్షన్‌ ట్రెండ్‌లో సినిమాను రూపొందించాలనేది మురుగదాస్‌ ఆలోచనగా కనిపిస్తుందనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో తుపాకీ, కత్తి, సర్కార్‌ చిత్రాల తర్వాత మరో సినిమా రూపొందాల్సింది. కానీ ఎందుకనో కొత్త ప్రాజెక్ట్‌ చర్చల దశలోనే ఆగిపోయింది. 


Updated Date - 2020-12-02T15:11:53+05:30 IST