రేర్ కాంబినేషన్: స్వీటీతో రౌడీ
ABN , First Publish Date - 2020-10-05T23:06:25+05:30 IST
ఇటీవల స్వీటీ అనుష్క తను నటించిన 'నిశ్శబ్దం' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు కథలు ఫైనల్ చేశానని

ఇటీవల స్వీటీ అనుష్క తను నటించిన 'నిశ్శబ్దం' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు కథలు ఫైనల్ చేశానని.. త్వరలోనే వాటి గురించి అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. అయితే ఆమె అలా చెప్పిన తర్వాత కూడా 'నిశ్శబ్దం' సినిమా రిజల్ట్‌ని చూపిస్తూ.. ఇక అనుష్క సినిమాలు చేయడం మానేసిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌కు చెక్ పెట్టేలా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో అనుష్కకు సంబంధించిన ఒక వార్త హల్‌చల్ చేస్తోంది.
అనుష్క తదుపరి చిత్రం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఉండబోతోందట. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని, ఇప్పటికే స్ర్కిప్ట్, ఇతరత్రా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అతి త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారనే వార్తలతో అనుష్క అభిమానులే కాదు.. విజయ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారే కాదు ఊహించని ఈ కాంబినేషన్ గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటుండటం విశేషం.
Read more