మెగాస్టార్‌తో మెహర్ చేయబోయేది ఆ రీమేకా..

ABN , First Publish Date - 2020-08-07T02:40:39+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు, మెహర్ రమేష్

మెగాస్టార్‌తో మెహర్ చేయబోయేది ఆ రీమేకా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు, మెహర్ రమేష్, బాబీ వంటి దర్శకులతో చిత్రాలు ఉంటాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవే స్వయంగా ప్రకటించారు. ఇందులో ‘లూసిఫర్’ రీమేక్ విషయమై చిరు ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఇటీవల టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపించాయి. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్‌కు సంబంధించి తెలుగు నెటివిటీకి అంతా మార్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చిరు ఇమేజ్‌కు సరిపోదనే అభిప్రాయంతో చిరు వెనక్కి తగ్గారని, అలాగే మరో దర్శకుడు మెహర్ రమేష్ చెప్పిన లైన్ నచ్చినా.. పూర్తి స్ర్కిప్ట్ మాత్రం చిరుకి నచ్చలేదని.. ఆ ప్రాజెక్ట్‌ని కూడా చిరు పక్కన పెట్టేశాడనేలా వార్తలు వినవచ్చాయి. కానీ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసే చిత్ర విషయమై ఇప్పుడు మళ్లీ మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తుంది.


తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదాలమ్’ చిత్ర రీమేక్ బాధ్యతలు మెహర్ రమేష్‌కు చిరు అప్పగించారట. ప్రస్తుతం తెలుగు నెటివిటీకి మెహర్ ఆ చిత్రాన్ని మార్చారట. త్వరలోనే పూర్తి స్ర్కిప్ట్‌ చిరుకు మెహర్ వినిపించనున్నాడని అంటున్నారు. అలాగే ఈ చిత్రం చిరుకి ఎంతో ఇష్టమైన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో కె.ఎస్. రామారావు నిర్మించనున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ విషయమై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

Updated Date - 2020-08-07T02:40:39+05:30 IST