రామ్ కోసం కథ సిద్ధం చేస్తున్న మారుతి..?

ABN , First Publish Date - 2020-03-08T01:55:51+05:30 IST

ప్రస్తుతం తెలుగులో ఉన్న మీడియం రేంజు హీరోల్లో అగ్ర భాగాన నిలిచే నాని, శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌తో ఇప్పటికే సినిమాలు చేసిన మారుతి.. ఈసారి హీరో రామ్‌పై దృష్టిపెట్టాడట.

రామ్ కోసం కథ సిద్ధం చేస్తున్న మారుతి..?

ప్రస్తుతం తెలుగులో ఉన్న మీడియం రేంజు హీరోల్లో అగ్ర భాగాన నిలిచే నాని, శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌తో ఇప్పటికే సినిమాలు చేసిన మారుతి.. ఈసారి హీరో రామ్‌పై దృష్టిపెట్టాడట. 'ప్రతిరోజూ పండగే' వంటి భారీ విజయం తర్వాత.. రామ్‌ కోసం కథను సిద్ధం చేస్తున్నాడట మారుతి. ఇప్పటికే మారుతి చెప్పిన స్టోరీ లైన్‌కి ఫిదా అయిన ఎనర్జిటిక్ స్టార్.. పూర్తిస్థాయి స్క్రిప్టుతో రమ్మని పురమాయించాడట. రామ్-మారుతి క్రేజీ కాంబినేషన్‌ని యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మించే అవకాశాలున్నాయట. ప్ర‌స్తుతం ‘రెడ్‌’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న రామ్‌.. మారుతి స్క్రిప్ట్‌కు ఓకే చెబుతాడ‌ని అంటున్నారు. 


Updated Date - 2020-03-08T01:55:51+05:30 IST