'పక్కా కమర్షియల్' అంటోన్న మారుతి

ABN , First Publish Date - 2020-12-27T02:07:21+05:30 IST

గత ఏడాది ప్రతిరోజూ పండగేతో బారీ హిట్‌ను సాధించిన దర్శకుడు మారుతి, తదుపరి సినిమా కథతో సిద్ధంగా ఉన్నారు.

'పక్కా కమర్షియల్' అంటోన్న మారుతి

గత ఏడాది ప్రతిరోజూ పండగేతో బారీ హిట్‌ను సాధించిన దర్శకుడు మారుతి, వెంటనే నెక్ట్స్‌ మూవీ గురించి అనౌన్స్‌మెంట్‌ ఇవ్వలేదు. కథ తయారు చేసుకుని అంతా సిద్ధమనుకునే లోపు కోవిడ ఫ్రభావం ప్రారంభమైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు మారుతి తన తర్వాత సినిమాను రవితేజతో చేద్దామని ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే రెమ్యునరేషన్స్‌ విషయంలో క్లారిటీ లేకపోవడంతో రవితేజ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడట. దీంతో ఇప్పుడు డైరెక్టర్‌ మారుతి ఇదే కథను హీరో గోపీచంద్‌తో చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడట. ఈ సినిమాలో డబ్బు కోసం ఎలాంటి కేసునైనా వాదించే లాయర్‌ పాత్రలో హీరో కనిపిస్తాడట. అందుకని ఈ సినిమా కోసం మారుతి ..'పక్కా కమర్షియల్‌' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. 

Updated Date - 2020-12-27T02:07:21+05:30 IST