మారుతి చూపు ఆ హీరో వైపు..?

ABN , First Publish Date - 2020-12-29T14:59:07+05:30 IST

`ప్రతి రోజూ పండగే` వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇప్పటివరకు డైరెక్టర్ మారుతి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు

మారుతి చూపు ఆ హీరో వైపు..?

`ప్రతి రోజూ పండగే` వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇప్పటివరకు డైరెక్టర్ మారుతి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా చేయాలనుకుని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. 


రవితేజకు కథ నచ్చినప్పటికీ రెమ్యునరేషన్ డీల్ సెట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో మారుతి ప్రస్తుతం గోపీచంద్ వైపు చూస్తున్నాడని సమాచారం. ఇదే కథతో గోపీచంద్ హీరోగా సినిమా చేయాలని మారుతి అనుకుంటున్నాడట. త్వరలోనే గోపీచంద్‌ను కలిసి మారుతి కథ వినిపించబోతున్నాడట. గీతా-2, యూవీ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. 

Updated Date - 2020-12-29T14:59:07+05:30 IST