డిజిటల్ రంగంలోకి మ‌ణిర‌త్నం..?

ABN , First Publish Date - 2020-06-05T17:47:16+05:30 IST

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం భారీ చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ను డైరెక్ట్ చేస్తున్నారు. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆగింది.

డిజిటల్ రంగంలోకి మ‌ణిర‌త్నం..?

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం భారీ చిత్రం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ను డైరెక్ట్ చేస్తున్నారు. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆగింది. షూటింగ్స్ ఓకే అయిన త‌ర్వాత ఈ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌ణిర‌త్నం డిజిట‌ల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం కాన్సెప్ట్‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ వెబ్‌సిరీస్‌కు మ‌ణిర‌త్నం నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌. త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ ప‌నిచేసే ఒక‌రికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-06-05T17:47:16+05:30 IST