ఇద్దరు ముద్దుగుమ్మలతో మంచు విష్ణు...?

ABN , First Publish Date - 2020-12-27T18:38:01+05:30 IST

పదమూడేళ్ల తర్వాత మంచు విష్ణు, శ్రీను వైట్ల కల‌యిక‌లో ‘డి అండ్‌ డి’ సినిమా రూపొందనుంది. ఇందులో...

ఇద్దరు ముద్దుగుమ్మలతో మంచు విష్ణు...?

మంచు విష్ణుకు క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘ఢీ’. ఈ కమర్షియల్ ఫార్ములాతో తర్వాత చాలా మంది దర్శకులు సినిమాలు చేశారు. ఢీ తర్వాత మళ్లీ విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో సినిమా రూపొంద‌లేదు. అయితే దాదాపు పదమూడేళ్ల తర్వాత వీరిద్ద‌రి కల‌యిక‌లో ‘డి అండ్‌ డి’ సినిమా రూపొందనుంది. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన సంగతి తెలిసిందే.  ‘డబుల్‌ డోస్‌‌’ అనేది క్యాప్ష‌న్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్‌ సమచారం మేరకు విష్ణు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌తో జోడీ కట్టబోతున్నాడట. అందులోఒకరు అను ఇమ్మాన్యుయేల్‌ కాగా.. మరొకరు ప్రగ్యా జైశ్వాల్‌. మరి ఇందులో నిజా నిజాలు తెలియాంటే కొన్నాళ్లు వెయిటింగ్‌ తప్పేలా లేదు.  ప్ర‌స్తుతం మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-27T18:38:01+05:30 IST