మంచు హీరోతో ఎన్టీఆర్ ఢీ

ABN , First Publish Date - 2020-07-03T19:59:44+05:30 IST

లాక్‌డౌన్ ముగిసి షూటింగ్స్‌కు ప‌రిమితులు ఇచ్చిన నేప‌థ్యంలో ద‌ర్శ‌కుధీరుడు రాజ‌మౌళి త‌న ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను షురూ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

మంచు హీరోతో ఎన్టీఆర్ ఢీ

లాక్‌డౌన్ ముగిసి షూటింగ్స్‌కు ప‌రిమితులు ఇచ్చిన నేప‌థ్యంలో ద‌ర్శ‌కుధీరుడు రాజ‌మౌళి త‌న ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను షురూ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తోన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఈ సినిమా ముగియ‌గానే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఈ చిత్రంలో హీరో మంచు మ‌నోజ్‌ను ప్ర‌తినాయ‌కుడిగా న‌టింప చేసేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Updated Date - 2020-07-03T19:59:44+05:30 IST