మంచు ఫ్యామిలీ ఓటీటీ ...?
ABN , First Publish Date - 2020-08-08T13:34:16+05:30 IST
మంచు కుటుంబం కూడా ఓటీటీని స్టార్ట్ చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.

డిజిటల్ మాధ్యమానికి ఉన్న ఆదరణ కరోనా సమయంలో ఎక్కువైంది. సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకుడు ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో తెలుగు కంటెంట్ ఓటీటీగా ఆహా ప్రారంభమైంది. ఇప్పుడు మరికొంత మంది నిర్మాతలు ఓటీటీలు స్టార్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంచు కుటుంబం కూడా ఓటీటీని స్టార్ట్ చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. హీరో, నిర్మాత అయిన మంచు విష్ణు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్. మంచు మోహన్‌బాబు నట వారసులుగా లక్ష్మీ మంచు, విష్ణు, మనోజ్‌లు ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నారట మంచు విష్ణు. ఇది వరకే మంచు విష్ణు ‘చదరంగం’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించి జీ5కి అందించిన సంగతి తెలిసిందే. మరి మంచువారు ఓటీటీ స్టార్ట్ చేస్తారనే వార్తలపై వారెలా స్పందిస్తారో వేచి చూడాలి.