మళ్లీ సంక్రాంతి బరిలో మహేష్?

ABN , First Publish Date - 2020-02-03T21:39:17+05:30 IST

ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయం అందుకున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నాడు.

మళ్లీ సంక్రాంతి బరిలో మహేష్?

ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయం అందుకున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నాడు. అక్కణ్నుంచి తిరిగి వచ్చిన తర్వాత దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో మహేష్.. జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
విదేశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం కొంత విశ్రాంతి తీసుకుని ఈ సినిమాను ప్రారంభించాలని మహేష్ అనుకుంటున్నాడట. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు తాజా సమాచారం. విజయ్ కోసం దర్శకుడు ఓ కీలక పాత్రను సృష్టించాడట.

Updated Date - 2020-02-03T21:39:17+05:30 IST