నారప్పలో మలయాళ హీరోయిన్..?
ABN , First Publish Date - 2020-03-13T21:15:24+05:30 IST
తమిళ చిత్రం అసురన్‌ను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్నారు.
తమిళ చిత్రం అసురన్‌ను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డి.సురేశ్‌బాబు, కలైపులి థాను నిర్మాతలు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఫ్లాష్ బ్యాక్‌లో మరో హీరోయిన్ పాత్రలో అమలాపాల్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ.. లేటెస్ట్ సమాచారం మేరకు మలయాళ బ్యూటీ రెబా జాన్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌లో నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.