రవితేజకు `నో` చెప్పిన హాట్ హీరోయిన్!

ABN , First Publish Date - 2020-06-16T17:24:47+05:30 IST

ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది మలయాళ భామ మాళవికా మోహనన్

రవితేజకు `నో` చెప్పిన హాట్ హీరోయిన్!

ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది మలయాళ భామ మాళవికా మోహనన్. సోషల్ మీడియాలో మాళవిక పోస్ట్ చేస్తున్న హాట్ హాట్ ఫొటోలే తెలుగులో ఆమె పాపులారిటీకి కారణం. `పేట` సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైన మాళవిక.. విజయ్‌తో కలిసి `మాస్టర్` సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 


తెలుగు నుంచి కూడా మాళవికకు ఓ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మాళవికను సంప్రదించారట. అయితే ఆ సినిమా చేయడానికి మాళవిక అంగీకరించలేదట. `మాస్టర్` విడుదల తర్వాతే కొత్త ప్రాజెక్టుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని మాళవిక భావిస్తోందట. విజయ్ దేవరకొండతో కలిసి `హీరో` సినిమా చేయడానికి గతంలో మాళవిక అంగీకరించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. 

Updated Date - 2020-06-16T17:24:47+05:30 IST