మహేశ్ 30 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించబోతున్నాడా?

ABN , First Publish Date - 2020-03-04T00:56:07+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాడు మహేశ్ బాబు. తాజాగా బాక్సాఫీస్ వద్ద 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న ఈ హీరో.. తరువాత ఏ చిత్రంలో నటిస్తాడన్న విషయంలో ఇంకా ..

మహేశ్ 30 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించబోతున్నాడా?

ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాడు మహేశ్ బాబు. తాజాగా బాక్సాఫీస్ వద్ద 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న ఈ హీరో..  తరువాత ఏ చిత్రంలో నటిస్తాడన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మూవీలో మహేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్  వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నటించడానికి  'రాజకుమారుడు' షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. 


నిజానికి కొరటాల శివ, చిరు మూవీలో ముందుగా రామ్ చరణ్ స్పెషల్ రోల్‌లో నటిస్తాడన్నటాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి మహేశ్ వచ్చి చేరాడట. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ 40 నిమిషాలు కనిపించబోతున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో 30 రోజుల పాటు మహేష్‌పై సన్నివేశాలు చిత్రీకరించాల్సి వస్తోందట. దీనిలో భాగంగా ఒక్కొక్క రోజుకు కోటి చొప్పున..  30 రోజులకు రూ.30 కోట్ల వరకూ ఛార్జ్ చేయనున్నాడట ఈ 'బిజినెస్ మేన్' 


నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో ఎంతటి హీరోకైనా రోజుకి కోటి రూపాయలు పారితోషికమన్నది కాస్త ఎక్కువ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం మహేశ్ తాను నటించే సినిమాలకి నిర్మాణ భాగ్యస్వామిగా ఉంటూ వస్తోన్నాడో. దీనితో ఈ మధ్య కాలంలో సూపర్‌స్టార్ బాగానే లాభాలను ఆర్జిస్తున్నాడు. ఇప్పుడు ఈ  లెక్కల ప్రకారమే 'ఆచార్య' నిర్మాతలు మహేశ్‌ని కోట్లతో ముంచెత్తడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి భారీ పారితోషకం తీసుకుంటున్న మహేశ్.. మెగాస్టార్ సినిమాకి ఎంత వరకు ప్లస్ అవుతాడో చూడాలి. 

Updated Date - 2020-03-04T00:56:07+05:30 IST

Read more