చిరు 152లో మ‌హేశ్ రోల్‌ మార్చేశారా?

ABN , First Publish Date - 2020-02-26T21:49:41+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డ్డాయి.

చిరు 152లో మ‌హేశ్ రోల్‌ మార్చేశారా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డ్డాయి. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కూడా మ‌హేశ్ న‌టించ‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని.. దాదాపు ఇరవై నిమిషాల ఉండే పాత్ర‌లో మ‌హేశ్ క‌నిపించ‌నున్నాడు. నిజానికి ఈ పాత్ర‌లో ముందుగా రామ్‌చ‌ర‌ణ్ నటిస్తాడ‌ని అనుకున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలో న‌టిస్తున్నందున రామ్‌చ‌ర‌ణ్ ఆ పాత్ర‌లో న‌టించ‌లేక‌పోతున్నాడు. దీంతో ఆ పాత్ర‌లో మ‌హేశ్ న‌టించ‌నున్నాడ‌ట‌. చ‌ర‌ణ్ కోసం న‌క్స‌లైట్ పాత్ర‌ను రాసుకున్న కొర‌టాల‌... మ‌హేశ్ కోసం న‌క్స‌లైట్‌గా కాకుండా స్టూడెంట్ లీడ‌ర్‌గా చూపించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. 

Updated Date - 2020-02-26T21:49:41+05:30 IST