మహేష్ `సర్కారు వారి పాట`!

ABN , First Publish Date - 2020-05-27T20:48:30+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్‌స్టార్ మహేష్

మహేష్ `సర్కారు వారి పాట`!

ఈ ఏడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్‌స్టార్ మహేష్ తర్వాతి సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. `గీతగోవిందం` దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో మహేష్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పరశురామ్ కూడా ఆ వార్తలను ధ్రువీకరించాడు. 


సూపర్‌స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. అదే రోజు లాంఛనంగా సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారట. ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు `సర్కారు వారి పాట` అనే టైటిల్ బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ సినిమా పరశురామ్ స్టైల్లో పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడట. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. 

Updated Date - 2020-05-27T20:48:30+05:30 IST