అదే సెంటిమెంట్‌తో కమల్ డైరెక్టర్‌‌..!

ABN , First Publish Date - 2020-11-13T21:13:47+05:30 IST

ఓ యంగ్‌ డైరెక్టర్‌ కూడా తన సెంటిమెంట్‌ను ఫాలో కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అదే సెంటిమెంట్‌తో కమల్ డైరెక్టర్‌‌..!

సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా సెంటిమెంట్‌ను ఫాలో కావడాన్ని మనం చూస్తుంటాం. ఇప్పుడు ఓ యంగ్‌ డైరెక్టర్‌ కూడా తన సెంటిమెంట్‌ను ఫాలో కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు.. లోకేశ్ కనకరాజ్‌. 'నగరం, ఖైదీ' చిత్రాలతో సూపర్‌హిట్‌లను సాధించిన ఈ దర్శకుడు ఇప్పుడు కమల్‌హాసన్‌తో 'విక్రమ్‌' అనే సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. మరి ఇంతకీ 'విక్రమ్‌' మూవీ మేకింగ్‌లో లోకేశ్‌ ఫాలో కాబోయే సెంటిమెంట్‌ ఏంటో తెలుసా!.. రాత్రుల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ చేయడం. వివరాల్లోకెళ్తే 'నగరం' సినిమాను లోకేశ్‌ ఎక్కువ భాగం రాత్రిలోనే చిత్రీకరించాడు. ఇక రెండో చిత్రం 'ఖైదీ' సినిమా అయితే పూర్తిగా రాత్రిలోనే చిత్రీకరించాడు లోకేశ్‌. అదే విధంగా విక్రమ్‌ సినిమాను కూడా లోకేశ్‌ రాత్రి సమయంలోనే చిత్రీకరించనున్నాడని సినీ వర్గాల సమాచారం. డిసెంబర్‌ మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించడానికి లోకేశ్‌ రెడీ అవుతున్నట్టు టాక్‌. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌ బావుందంటూ మంచి స్పందన వచ్చింది. మరి సినిమా ఏమేరకు మెప్పిస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. 


Updated Date - 2020-11-13T21:13:47+05:30 IST