హీరోగారి ప్రియురాలు, చెల్లెలు.. మధ్యలో నెటిజన్లు

ABN , First Publish Date - 2020-05-25T03:15:19+05:30 IST

ఆమె ఓ అందమైన హీరోయిన్. విశేషం అది కాదు. ఆమెని మరో బ్యూటీ.. పనిగట్టుకుని మెచ్చుకుంది. పైగా సదరు బ్యూటీ ఆ హీరోయిన్‌గారి కాబోయే భర్తకి చెల్లెలు. ఇంతకీ ఆ ఆడపడుచు

హీరోగారి ప్రియురాలు, చెల్లెలు.. మధ్యలో నెటిజన్లు

ఆమె ఓ అందమైన హీరోయిన్. విశేషం అది కాదు. ఆమెని మరో బ్యూటీ.. పనిగట్టుకుని మెచ్చుకుంది. పైగా సదరు బ్యూటీ ఆ హీరోయిన్‌గారి కాబోయే భర్తకి చెల్లెలు. ఇంతకీ ఆ ఆడపడుచు చేత ఆహా అనిపించుకున్న ఆ అందాలరాశి ఎవరు?. దిశా పటాని అందం గురించి కొత్తగా చెప్పాలా..! ఆమె హాట్ లుక్స్ గురించి మరోసారి మాట్లాడుకోవడం అవసరమా..! అస్సలు అక్కరలేదు. కానీ ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఓ సింపుల్ ఇన్‌స్టాగ్రమ్ పిక్ దిశా దివ్యమైన దేహకాంతిని మరోమారు చర్చకు తీసుకొచ్చింది. దిశా పటాని నటిగా ఎంత ఫేమస్సో అంతే ఫేమస్ బ్రాండ్ అంబాసిడర్‌గా. లో దుస్తులు మొదలు కూల్ డ్రింక్స్ వరకు ఆమె చాలా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుంది. అయితే గ్లామర్ విషయంలో మొహమాటం లేని మిస్ పటాని తన స్కిన్ షోతో ఎప్పటికప్పుడు కుర్రాళ్ళని కట్టి పడేస్తుంటుంది. కానీ ఊర్వశిలా ఊరించే ఈ ఉత్తరాఖండ్ సుందరి కేవలం అబ్బాయిలనే కాదు, అమ్మాయిలను కూడా తన మేని మెరుపులతో మాయ చేయగలదు. 


దిశా అందానికి ఓ అమ్మాయి ఫ్లాటైపోయింది. తానెవరో కాదు దిశా బాయ్ ఫ్రెండ్ అయిన టైగర్‌కి చెల్లెలు కృష్ణా ష్రాఫ్. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురే ఈ కృష్ణ. ఈమె కూడా బి టౌన్‌లో బాగా పాపులరే. అయితే తాజాగా దిశా పటాని ఇన్‌స్టాగ్రమ్ ఫోటోపై ఈమె ఓ కామెంట్ చేసింది. మేని మెరుపు అద్భుతంగా ఉంది. చర్మం కోసం ఏం వాడుతుంటావ్ అంది. ప్రియుడి సోదరి కామెంట్‌కి దిశా కూడా ప్రియమైన జవాబు ఇచ్చింది. నువ్వు అద్భుతంగా ఉంటావ్. నువ్వు నన్నడగాల్సిన ప్రశ్నయేనా అంటూ ఆడపడుచుని పొగిడేసింది. ఇక వీరిద్దరి సంభాషణలోకి ఇతర నెటిజెన్లు కూడా చొరబడ్డారు. చాలామంది దిశా పటానిని, కృష్ణా ష్రాఫ్ వదిన అంటూ సంబోధించారు. ఇంతకీ ఇదంతా చూస్తూ బాలీవుడ్ సరికొత్త స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఏమనుకుంటున్నాడో.. 

Updated Date - 2020-05-25T03:15:19+05:30 IST

Read more