సినిమా బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల వెబ్‌సిరీస్‌..?

ABN , First Publish Date - 2020-09-08T20:05:56+05:30 IST

సుకుమార్, హరీశ్ శంకర్ బాటలో కొరటాల శివ కూడా నిర్మాతగా మారుతున్నారట.

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల వెబ్‌సిరీస్‌..?

ఇప్పుడు మన స్టార్స్‌ హీరోలు, దర్శకులు సినీ నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలను రూపొందించడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ బాటలో సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌ వంటి స్టార్‌ డైరెక్టర్స్‌ ఉన్నారు. వీరితో పాటు కొరటాల శివ కూడా చేరుతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌ సమాచారం మేరకు కొరటాల శివ తన దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కిరణ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ వెబ్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. కొరటాల శివ ఈ వెబ్‌సిరీస్‌ను రాయడం విశేషం. ఈ వెబ్‌ సిరీస్‌ సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో కొరటాల ఎలాంటి అంశాలను టచ్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 


Updated Date - 2020-09-08T20:05:56+05:30 IST