నిర్మాతల కోసం కొర‌టాల ఆ ప‌ని చేస్తున్నారా?

ABN , First Publish Date - 2020-06-28T17:25:39+05:30 IST

నేటిత‌రం టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్ట‌ర్స్‌లో కొర‌టాల శివ ఒక‌రు. ప్ర‌స్తుతం ఈయ‌న మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ను డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

నిర్మాతల కోసం కొర‌టాల ఆ ప‌ని చేస్తున్నారా?

నేటిత‌రం టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్ట‌ర్స్‌లో కొర‌టాల శివ ఒక‌రు. ప్ర‌స్తుతం ఈయ‌న మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ను డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులంతా స‌ద్దుమ‌ణిగాక సెట్స్ పైకి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. డైరెక్ట‌ర్ కొర‌టాల బేసిగ్గా రైట‌ర్ కూడా. కొర‌టాల‌తో మంచి అనుబంధం ఉన్న మైత్రీ మూవీమేక‌ర్స్ తాము త‌దుప‌రి మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేష‌న్‌లో చేయ‌బోయే సినిమాకు స్క్రిప్ట్ అడ్వైజైర్‌గా ప‌నిచేయ‌మ‌ని కొర‌టాల‌ను కోరార‌ట‌. ఆ సినిమా హిట్ అయ్యి వ‌చ్చే లాభాల్లో కొంత వాటాను ఇస్తామ‌న్నార‌ట‌. అందుకు కొర‌టాల కూడా ఒప్పుకున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై కొర‌టాల కానీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Updated Date - 2020-06-28T17:25:39+05:30 IST