కొర‌టాల ల‌వ్‌స్టోరి

ABN , First Publish Date - 2020-07-28T16:40:56+05:30 IST

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఓ ల‌వ్‌స్టోరిని రూపొందించ‌నున్నారు. అయితే ఈ ల‌వ్‌స్టోరిని కొర‌టాల డైరెక్ట్ చేయ‌డం లేద‌ట‌.

కొర‌టాల ల‌వ్‌స్టోరి

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఓ ల‌వ్‌స్టోరిని రూపొందించ‌నున్నారు. అయితే ఈ ల‌వ్‌స్టోరిని కొర‌టాల డైరెక్ట్ చేయ‌డం లేద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో కొర‌టాల శివ ఓ వెబ్‌సిరీస్‌ను రాశార‌ట‌. ఈ వెబ్‌సిరీస్‌ను కొర‌టాల నిర్మించ‌నున్నారు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసే కిర‌ణ్ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. కొర‌టాల త‌న‌దైన శైలిలో ల‌వ్‌స్టోరితో పాటు యూత్‌కు మంచి మెసేజ్‌ను ఇచ్చేలా క‌థ‌ను డిజైన్ చేశార‌ట‌. ప్ర‌స్తుతం కొర‌టాల చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత బన్నీతో సినిమాను తెరకెక్కిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-07-28T16:40:56+05:30 IST