బన్నీ కోసం కొరటాల డిజైన్ చేసిన పాత్ర ఏంటంటే..?
ABN , First Publish Date - 2020-07-27T15:32:43+05:30 IST
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు కొరటాల శివ బన్నీని కొరటాల శివ స్టూడెంట్ లీడర్ పాత్రలో చూపించనున్నారట.

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు కొరటాల శివ బన్నీని కొరటాల శివ స్టూడెంట్ లీడర్ పాత్రలో చూపించనున్నారట. కెరీర్ ప్రారంభంలో ఆర్య, బన్ని చిత్రాల్లో అల్లు అర్జున్ స్టూడెంట్‌గా కనిపించారు. కానీ.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే చిత్రమిదే అవుతుంది. సాధారణంగా తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్‌లను మిక్స్ చేసి తెరకెక్కించే కొరటాల శివ..బన్నీతో ఎలాంటి మెసేజ్‌ను ఇవ్వనున్నారో తెలియాలంటే వేచి చూడక తప్పదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా పూర్తి కాగానే బన్నీతో సినిమాను తెరకెక్కిస్తారట. ఆలోపు బన్నీ కూడా ‘పుష్ప’ చిత్రాన్ని పూర్తి చేసుకుంటారు.