స్టార్ హీరో సరసన కియార?
ABN , First Publish Date - 2020-12-21T15:23:51+05:30 IST
తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `కబీర్‌సింగ్` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కియారకు మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట.
హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఆ విషయంలో కూడా స్పష్టత వచ్చేసినట్టు తెలుస్తోంది. `క్రిష్-4`లో నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా కియారను తీసుకున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతోందట.
Read more