పెళ్లికి ముందు శృంగారం.. కియారా వ్యాఖ్యలతో దుమారం

ABN , First Publish Date - 2020-02-26T20:56:46+05:30 IST

అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది

పెళ్లికి ముందు శృంగారం.. కియారా వ్యాఖ్యలతో దుమారం

అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. పెళ్లికి ముందు శృంగారం గురించి కియారా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే కచ్చితంగా పెళ్ళి చేసుకుంటానని అనుకుంటేనే అటువంటి బంధం కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.


తాను ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో పడలేదని తెలిపిన కియారా... ఒకవేళ తను ఎవరితో ప్రేమలో ఉన్నా..  మీడియాకు ధైర్యంగా తెలుపుతానని అంది. ఎవరైనా పెళ్ళి చేసుకుంటాను అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే రిలేషన్‌షిప్ మొదలు పెట్టాలి. నమ్మకం ఉన్నప్పుడు శారీరకంగా దగ్గరైనా ఎలాంటి తప్పు లేదనేది తన అభిప్రాయమని కియారా తెలిపింది. ఇప్పుడీ మాటలు పెద్ద దుమారాన్నే లేపాయంటున్నారు సినీ జనాలు.

Updated Date - 2020-02-26T20:56:46+05:30 IST