సంక్రాంతికి `కేజీఎఫ్-2` టీజర్?

ABN , First Publish Date - 2020-11-06T17:45:49+05:30 IST

కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `కేజీయఫ్-2` సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సంక్రాంతికి `కేజీఎఫ్-2` టీజర్?

కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `కేజీయఫ్-2` సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `కేజీఎఫ్` మొదటి భాగం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ రెండో భాగానికి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పటికే విడుకాల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ అనంతరం ఈ మధ్యనే షూటింగ్ పున:ప్రారంభమైంది. 


ఈ సినిమా టీజర్ త్వరలోనే విడుదల కాబోతోందట. ఈ దసరాకు టీజర్ వస్తుందని అందరూ భావించారు. కానీ విడుదల కాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. 

Updated Date - 2020-11-06T17:45:49+05:30 IST