ఈ నెలలోనే‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ షూటింగ్ ..?

ABN , First Publish Date - 2020-08-07T19:35:04+05:30 IST

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’.

ఈ నెలలోనే‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ షూటింగ్ ..?

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’. ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజైంది. ఈ సినిమా స‌క్సెస్‌తో రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. నిర్మాత‌లు ఈ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లు సినిమాను రూపొందిస్తున్నారు. సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ వంటి బాలీవుడ్ స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు కూడా. షూటింగ్ విష‌యానికి వ‌స్తే.. ఓ నెల‌రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేసే లోపే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లు కావ‌డంతో సినిమా షూటింగ్ ఆగింది. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌భుత్వాలు షూటింగ్‌ల‌కు అనుమ‌త‌లు ఇవ్వ‌డంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆగ‌స్ట్ మూడో వారంలో స్టార్ట్ చేయాల‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. మ‌రి షూటింగ్ స్టార్ట్ అయిన త‌ర్వాత సజావుగా సాగితే విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ వ‌స్తుంది. 

Updated Date - 2020-08-07T19:35:04+05:30 IST