ఓటీటీలో కీర్తి సురేశ్ సినిమా..!

ABN , First Publish Date - 2020-05-11T13:07:00+05:30 IST

కీర్తిసురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘పెంగ్విన్’ సినిమాను థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీ మాధ్య‌మ‌మైన అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

ఓటీటీలో కీర్తి సురేశ్ సినిమా..!

‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిగా మ‌రో మెట్టు ఎదిగింది. ఆ త‌ర్వాత ఈమె ‘మ‌న్మ‌థుడు 2’లో చిన్న అతిథి పాత్ర‌లో నటించిందంతే. మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న స‌మయంలో క‌రోనా ప్ర‌భావం సినీ ఇండ‌స్ట్రీని తాకింది. దీంతో స‌ద‌రు సినిమా విడుద‌ల‌లు ఆగిపోయాయి. తాజా స‌మాచారం మేర‌కు కీర్తిసురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘పెంగ్విన్’ సినిమాను థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీ మాధ్య‌మ‌మైన అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. జూన్ నెల‌లో ఓటీటీలో ప్ర‌సార‌వుతుంద‌ని, దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డుతుందని టాక్‌. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Updated Date - 2020-05-11T13:07:00+05:30 IST