మహేష్ సినిమాపై కీర్తి స్పందన!

ABN , First Publish Date - 2020-06-16T22:23:29+05:30 IST

`సరిలేరు నీకెవ్వరు` తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్‌కు ఓకే చెప్పాడు.

మహేష్ సినిమాపై కీర్తి స్పందన!

`సరిలేరు నీకెవ్వరు` తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్‌కు ఓకే చెప్పాడు. ఈ సినిమాకు `సర్కారు వారి పాట` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. 


పూజా హెగ్డే, కియార అడ్వాణీ పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి కీర్తి సురేష్‌ను ఫైనలైజ్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి కీర్తి స్పందించింది. `మహేష్‌తో సినిమా ఇంకా ఖరారు కాలేదు. అయితే కచ్చితంగా నేనే ప్రకటిస్తాన`ని కీర్తి చెప్పింది. కీర్తి నటించిన `పెంగ్విన్` సినిమా ఈ నెల 19న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


Updated Date - 2020-06-16T22:23:29+05:30 IST