కీర్తి మళ్లీ బరువు పెరుగుతోందా?

ABN , First Publish Date - 2020-12-22T18:12:36+05:30 IST

`మహానటి` సినిమాతో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది హీరోయిన్ కీర్తీ సురేష్.

కీర్తి మళ్లీ బరువు పెరుగుతోందా?

`మహానటి` సినిమాతో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది హీరోయిన్ కీర్తీ సురేష్. ఆ చిత్రంలో ఆమె నటన అందరి మన్ననలూ పొందింది. అయితే ఆ తర్వాత కీర్తి చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అంతేకాదు కీర్తి లుక్‌పై కూడా విమర్శలు వచ్చాయి.  


`పెంగ్విన్`, `మిస్ ఇండియా` సినిమాల్లో కీర్తి స్లిమ్ లుక్‌లో కనిపించింది. ఈ లుక్‌కు అభిమానుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో కీర్తి మళ్లీ బరువు పెరుగుతోందట. మహేష్ హీరోగా డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న `సర్కారు వారి పాట`లో కీర్తి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి మునపటి రూపంలోనే కాస్త బొద్దుగా కనిపించబోతోందట. 


Updated Date - 2020-12-22T18:12:36+05:30 IST