`గుడ్ లక్ సఖి` అంటున్న కీర్తి?

ABN , First Publish Date - 2020-05-11T21:46:16+05:30 IST

`మహానటి`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.

`గుడ్ లక్ సఖి` అంటున్న కీర్తి?

`మహానటి`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు, కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. ఇప్పటికే `మిస్ ఇండియా` సినిమాను విడుదలకు సిద్ధం చేసింది. 


విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. కథతో పాటు తెరకెక్కిస్తున్న విధానం కూడా నచ్చడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారట. ఈ సినిమాకు `గుడ్ లక్ సఖి` అనే టైటిల్‌ను ఖరారు చేశారట. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమా విడుదల కాబోతోందట. రెండు భాషలకు సూట్ అయ్యేలా ఈ టైటిల్ పెట్టారట. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.  

Updated Date - 2020-05-11T21:46:16+05:30 IST