మెగాస్టార్ సినిమాలో కీర్తి.. భారీ రెమ్యునరేషన్!

ABN , First Publish Date - 2020-10-28T18:11:57+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి `వేదాళం` రీమేక్‌లో చెల్లెలి పాత్ర పోషించే నటి ఎవరనే విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే.

మెగాస్టార్ సినిమాలో కీర్తి.. భారీ రెమ్యునరేషన్!

మెగాస్టార్ చిరంజీవి `వేదాళం` రీమేక్‌లో చెల్లెలి పాత్ర పోషించే నటి ఎవరనే విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే. మొదట ఈ పాత్రకు నటి సాయి పల్లవి పేరు వినిపించింది. అయితే చిరంజీవి పక్కన సాయిపల్లవి మరీ చిన్నపిల్లలా ఉంటుందని భావించి కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.  


ఈ సినిమాలో నటిస్తున్నందుకు కీర్తి భారీ రెమ్యునరేషన్ అందుకోబోతోందట. హీరోయిన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న కీర్తి సోదరి పాత్రను అంగీకరించడం విశేషమనే చెప్పాలి. కథలో కీలకమైన పాత్ర కావడంతో కీర్తికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. 

Updated Date - 2020-10-28T18:11:57+05:30 IST