‘ఖైదీ’ రీమేక్‌లో క‌త్రినా..!

ABN , First Publish Date - 2020-08-17T14:16:57+05:30 IST

‘ఖైదీ’ హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఫాత్రను యాడ్ చేయనున్నారట.

‘ఖైదీ’ రీమేక్‌లో క‌త్రినా..!

గ‌త ఏడాది కార్తి హీరోగా విడుద‌లైన చిత్రం ‘ఖైదీ’. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌నున్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌ హీరోగా న‌టించ‌నున్నారు. ‘ఖైదీ’లో హీరోయిన్ రోల్ ఉండ‌దు. హీరోయిన్ పాత్ర‌నే తెర‌పై చూపించ‌రు. కానీ హిందీలో కొన్ని మార్పులు, చేర్పులు చేయ‌బోతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్‌లో హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేస్తున్నార‌ట‌. అందుకోసం కత్రినా కైఫ్‌ను సంప్ర‌దిస్తే్.. చిన్న‌రోల్ కావ‌డంతో ఆమె కూడా న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ని టాక్‌. ఫిబ్ర‌వ‌రి నుండి సినిమాను స్టార్ట్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. 

Updated Date - 2020-08-17T14:16:57+05:30 IST