క్రేజీ టైటిల్‌తో కల్యాణ్‌రామ్‌..!

ABN , First Publish Date - 2020-12-27T18:00:55+05:30 IST

దిల్ రాజు బ్యానర్ లో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతు్న్నారట. ఈ చిత్రానికి ఓ క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

క్రేజీ టైటిల్‌తో కల్యాణ్‌రామ్‌..!

నందమూరి కల్యాణ్‌రామ్‌కి ఈ మధ్య కాలంలో 118 సక్సెస్‌ తర్వాత ఆశించిన రేంజ్‌లో హిట్‌ లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'ఎంత మంచివాడవురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇప్పుడు కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమాకు కూడా కల్యాణ్‌రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట. ఈ చిత్రానికి 'డూ ఆర్‌ డై' అనే క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లోనూ మరో సినిమా చేయడానికి కల్యాణ్‌రామ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-12-27T18:00:55+05:30 IST