నిశ్చితార్థం రింగ్‌ ఇదేనా?

ABN , First Publish Date - 2020-10-25T05:48:38+05:30 IST

టాలీవుడ్‌ మిత్రవింద కాజల్‌ అగర్వాల్‌ ఇంట మరో వారం రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు...

నిశ్చితార్థం రింగ్‌ ఇదేనా?

టాలీవుడ్‌ మిత్రవింద కాజల్‌ అగర్వాల్‌ ఇంట మరో వారం రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఇరువురి ఇళ్లల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. తన ప్రియుడి చూపులను ఆకట్టుకునేందుకు కాజల్‌ రెడీ అవుతున్నారు. తాజాగా తన చేతివేళ్లను చూపిస్తూ ఇన్‌స్టా వేదికగా ఆమె ప్రత్యేక వీడియో పోస్ట్‌ చేశారు. అందులో కాజల్‌ వేలికి ఉన్న డైమండ్‌ రింగ్‌ అందరిని ఆకట్టుకుంటోంది. అది నిశ్చితార్థ ఉంగరమే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మరో పక్క గౌతమ్‌ కిచ్లు కూడా పెళ్లి దుస్తుల ఎంపికలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. ‘వెడ్డింగ్‌ షాపింగ్‌!! నా వివాహ దుస్తులను ఏ డిజైనర్స్‌ సిద్థం చేస్తున్నారో తెలుసా?’ అని ఆయన నెటిజన్లను ప్రశ్నించారు. పెళ్లి తర్వాత తాము నివసించబోయే ఇంటిని అలంకరించే పనిలో గౌతమ్‌ ఉన్నారని, ఇంటి అలంకరణ విషయంలో సలహాలు ఉంటే చెప్పమని కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులను కోరిన సంగతి తెలిసిందే! 

Updated Date - 2020-10-25T05:48:38+05:30 IST

Read more