అన్నయ్య రిలీజ్ డేట్‌పై కన్నేసిన తమ్ముడు

ABN , First Publish Date - 2020-04-07T16:06:54+05:30 IST

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంద‌ట‌.

అన్నయ్య రిలీజ్ డేట్‌పై కన్నేసిన తమ్ముడు

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంద‌ట‌. ఈలోపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో ‘వ‌కీల్‌సాబ్‌’ స‌హా అన్నీ సినిమాల షూటింగ్‌ల‌ను ఆపేశారు. ఇప్పుడు ఈ గ్యాప్ సినిమా రిలీజ్ డేట్‌పై ప్ర‌భావం చూపేలా ఉంది. ముందుగా దిల్‌రాజు ‘వ‌కీల్‌సాబ్‌’ను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేసుకోక త‌ప్పేలా లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జూలైలో ప‌వ‌న్ సినిమా సంద‌డి ఉంటుంద‌నే వార్త‌లు కూడా వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆగ‌స్ట్ 14న  ‘వ‌కీల్‌సాబ్‌’ను విడుదల చేయాలని దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. నిజానికి షూటింగ్ స‌జావుగా సాగుంటే చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ‘ఆచార్య’ మ‌రింత వెన‌క్కి వెళ్లింద‌ని టాక్‌. దీంతో అన‌య్య రిలీజ్ డేట్‌లోనే రావ‌డానికి ప‌న‌వ్ సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Updated Date - 2020-04-07T16:06:54+05:30 IST