బాలయ్య ప్యాన్ ఇండియా మూవీగా ఆదిత్య369!

ABN , First Publish Date - 2020-06-10T23:37:39+05:30 IST

నందమూరి నటసింహ బాలకృష్ణ కెరీర్‌లో 'ఆదిత్య 369' చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. టైమ్‌ మెషీన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో..

బాలయ్య ప్యాన్ ఇండియా మూవీగా ఆదిత్య369!

నందమూరి నటసింహ బాలకృష్ణ కెరీర్‌లో 'ఆదిత్య 369' చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. టైమ్‌ మెషీన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమా 1991లో విడుదలై ప్రేక్షకుల్నిఆకట్టుకుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా ద్విపాత్రాభినయంతో ఆక్టుకున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సిద్దమవుతున్నాడట బాలకృష్ణ.


గత కొంత కాలంగా సీక్వెల్ విషయమై చర్చలు సాగుతూనే ఉన్నాయి. 'ఆదిత్య 999' టైటిల్ అని కూడా వినిపించింది. షష్టిపూర్తి సందర్భంగా బాలకృష్ణ 'ఆదిత్య 369' సీక్వెల్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. దర్శకుడు సింగీతం కూడా 'ఆదిత్య 369' సీక్వెల్ కథను రెడీ చేస్తున్నారట. ఈ జనరేషన్ స్టార్స్‌తో పాటు.., సీనియర్ హీరోలు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇక బాలయ్యను కూడా పాన్ ఇండియా స్టార్‌గా చూడాలనేది నందమూరి అభిమానుల కోరిక. దానికనుగుణంగా బాలకృష్ణ 'ఆదిత్య 369' సీక్వెల్‌ను ట్రాక్‌లోకి తెస్తున్నాడట. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తరువాత పలువురు దర్శకులు బాలయ్యతో సినిమా చేయడానికి క్యూలో ఉన్నారు. మరి ఈ కమిట్మెంట్స్ చేసి 2021లో నైనా బాలయ్య  'ఆదిత్య 369' సీక్వెన్‌ని పట్టాలెక్కిస్తాడేమో చూద్దాం. 

Updated Date - 2020-06-10T23:37:39+05:30 IST