ఇంటర్నేషనల్ బాక్సర్‌తో విజయ్ దేవరకొండ ..?
ABN , First Publish Date - 2020-03-08T15:01:26+05:30 IST
ప్రస్తుతం యూత్‌తో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్‌లో విజయ్ దేరవకొండ ఒకరు. ఈ యువ హీరో ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం యూత్‌తో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్‌లో విజయ్ దేరవకొండ ఒకరు. ఈ యువ హీరో ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ ఇంటర్నేషనల్ బాక్సర్‌ను నటింప చేయాలని పూరి భావిస్తున్నాడట. మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపించాయి. కానీ.. పూరి ఇప్పుడు ఆయన స్థానంలో మరో ఇంటర్నేషనల్ బాక్సర్‌ను నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుందట.ఇప్పటికే ఈ సినిమా 40 రోజుల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.