వైష్ణవ్.. క్రిష్.. `కొండపొలం`?

ABN , First Publish Date - 2020-12-03T03:02:23+05:30 IST

తొలి సినిమా `ఉప్పెన` విడుదల కాకముందే మెగా ఫ్యామిలీ హీరో `పంజా` వైష్ణవ్ తేజ్ మరో సినిమాను పూర్తి చేశాడు.

వైష్ణవ్.. క్రిష్.. `కొండపొలం`?

తొలి సినిమా `ఉప్పెన` విడుదల కాకముందే మెగా ఫ్యామిలీ హీరో `పంజా` వైష్ణవ్ తేజ్ మరో సినిమాను పూర్తి చేశాడు. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను రూపొందించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో డీ-గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలం` నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. 


పక్కా ప్లానింగ్‌తో కేవలం 45 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. కోవిడ్, హైదరాబాద్ వరదలు వంటి ఆటంకాలు ఏర్పడినా షూటింగ్ మాత్రం శరవేగంగా జరిగిపోయింది. వికారాబాద్ అటవీ ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు నవల పేరు `కొండ పొలం`నే టైటిల్‌గా ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Updated Date - 2020-12-03T03:02:23+05:30 IST