`ఇండియన్-2` మళ్లీ ఆగిపోయిందా?

ABN , First Publish Date - 2020-03-04T19:15:02+05:30 IST

తమిళ అగ్రదర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం `ఇండియన్-2`

`ఇండియన్-2` మళ్లీ ఆగిపోయిందా?

తమిళ అగ్రదర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం `ఇండియన్-2`. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రారంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. దర్శకుడికి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు తలెత్తడంతో కొద్ది నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. 


ఆ తర్వాత వారి మధ్య రాజీ కుదురడంతో మళ్లీ మొదలైంది. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో తాజా ప్రమాదం చిత్ర యూనిట్‌ను గందరగోళంలోకి నెట్టేసింది. ఈ ప్రమాదానికి నిర్మాణ సంస్థ తప్పిదాలే కారణమని కమల్ హాసన్, శంకర్ ఆరోపించారు. దర్శకుడిపై నిర్మాణ సంస్థ విమర్శలు చేసింది. ఈ ప్రమాదం వల్ల నిర్మాణ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందట. దీంతో ఇక, `ఇండియన్-2` షూటింగ్ ఆగిపోయినట్టేనని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అనుకున్నట్లుగా ఈ సినిమా షూటింగ్ పూర్తవడం కష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-03-04T19:15:02+05:30 IST

Read more