ప్రభాస్ 20 కోసం భారీ సెట్

ABN , First Publish Date - 2020-06-15T15:42:18+05:30 IST

ప్రస్తుతం ప్ర‌భాస్, రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప్రభాస్ 20 కోసం భారీ సెట్

ప్రస్తుతం ప్ర‌భాస్, రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. క‌రోనా ఎఫెక్ట్‌కు ముందు ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను జార్జియాలో చిత్రీక‌రించారు. ఇప్పుడు మిగిలిన పార్ట్ కోసం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేస్తున్నార‌ట‌. క‌రోనా ప్ర‌భావంతో ఈ సినిమాను హైద‌రాబాద్‌లోనే సెట్స్ వేసి చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ‘రాధేశ్యామ్‌’, ‘ఓ డియ‌ర్’ టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 

Updated Date - 2020-06-15T15:42:18+05:30 IST