అగ్ర నిర్మాతకు నో చెబుతున్న హీరోలు?

ABN , First Publish Date - 2020-02-03T20:04:50+05:30 IST

'డ్రీమ్ గర్ల్' కూడా ఓ విభిన్నమైన వినోదాల హంగామా. ఆయుష్మాన్ రెగ్యులర్ గా చేస్తున్న సరికొత్త రకం సినిమాల్లో ఇది కూడా ఒకటి. అందుకే, బాలీవుడ్ ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. వెంటనే మన నిర్మాత సురేశ్ బాబు తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు.

అగ్ర నిర్మాతకు నో చెబుతున్న హీరోలు?

తెలుగు సినిమా అంటే గుర్తుకు వచ్చే బడా నిర్మాతల్లో సురేశ్ బాబు ఒకరు. ఎన్నో సినిమాలు తీసిన ఆయన ఈ మధ్యే 'వెంకీ మామ' లాంటి ఎంటర్‌టైనర్నఅందించారు. అయితే, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత ఇప్పుడు ఓ రీమేక్ సినిమా చేయాలని నడుం బిగించాడట. కానీ, సదరు రిస్కీ రీమేక్ కోసం డబ్బులు పెట్టే నిర్మాత రంగంలోకి దిగినా... ముఖానికి రంగు వేసుకోటానికి మాత్రం హీరోలే కరువయ్యారట. 'డ్రీమ్ గర్ల్'... ఈ పేరుతో బాలీవుడ్ లో ఓ మూవీ వచ్చింది. హీరోగా నటించింది ఆయుష్మాన్ ఖురానా. మరి ఈ టాలెంటెడ్ నటుడు ఉన్నాడంటే కథలో ఖచ్చితంగా విషయం ఉంటుందని ప్రత్యేకించి చెప్పాలా!? 'డ్రీమ్ గర్ల్' కూడా ఓ విభిన్నమైన వినోదాల హంగామా. ఆయుష్మాన్ రెగ్యులర్ గా చేస్తున్న సరికొత్త రకం సినిమాల్లో ఇది కూడా ఒకటి. అందుకే, బాలీవుడ్ ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. వెంటనే మన నిర్మాత సురేశ్ బాబు తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు.

 

ఒక భాషలో సూపర్ హిట్టైన సినిమా రీమేక్ అంటే చాలా మంది హీరోలు ఉత్సాహం చూపిస్తారు. కానీ, 'డ్రీమ్ గర్ల్' సినిమాలో హీరో, లేడీ వాయిస్ తో మాట్లాడాలి! కొన్ని సన్నివేశాల్లో ఆడ వేషం వేయాలి కూడా. మరి ఇటువంటి హీరోయిజం లేని ఫన్నీ క్యారెక్టర్ లో మన తెలుగు కథానాయకులు ఎవరు కనిపిస్తారు చెప్పండి!? అందుకే, రీమేక్ చేద్దామనుకున్న సురేశ్ బాబుకి ఎవరి నుంచీ ''ఎస్'' అనే యాన్సర్ రావటం లేదట. దగ్గుబాటి హీరోలు, బయటి హీరోలు ఏ ఒక్కరూ తెలుగు 'డ్రీమ్ గర్ల్' అవ్వలేకపోతున్నారట. ఇలా అయితే ఇక సరికొత్త రకం సినిమాలు తెలుగు తెరపైకి ఎలా వస్తాయని క్రిటిక్స్ ఫీలవుతున్నారు. గతంలో ఆయుష్మాన్ నటించిన 'అంధాధున్' కూడా ఇలాగే తెలుగులోకి రాబోయి... నిరవధికంగా ఆగిపోయింది! అందులో హీరో చూడగలిగి కూడా గుడ్డివాడుగా నటించాలి! అదీ మన టాలీవుడ్ బాబుల వల్ల కాలేదట! అందుకే సెట్స్ పైకి 'అంధాధున్' రీమేక్ వెళ్ళలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు 'డ్రీమ్ గర్ల్' భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి మరి!

Updated Date - 2020-02-03T20:04:50+05:30 IST