`బిగ్‌బాస్-4`: గ్రాండ్ ఫినాలేకు హాట్ హీరోయిన్లు?

ABN , First Publish Date - 2020-12-15T15:40:15+05:30 IST

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న `బిగ్‌బాస్-4` కార్యక్రమం చివరి దశకు చేరువైంది.

`బిగ్‌బాస్-4`: గ్రాండ్ ఫినాలేకు హాట్ హీరోయిన్లు?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న `బిగ్‌బాస్-4` కార్యక్రమం చివరి దశకు చేరువైంది. మరో వారం రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి కాబోతోంది. ఈ నెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. `బిగ్‌బాస్-3` తరహాలోనే ఈసారి కూడా ఫినాలేను భారీగానే నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. 


`బిగ్‌బాస్-4` ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ లేదా చిరంజీవి వస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ వేడుకలో హాట్ హీరోయిన్లు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అలరించనున్నారట. నివేదా పేతురాజ్, మెహ్రీన్, లక్ష్మీరాయ్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌లతో కనువిందు చేయబోతున్నారట. వీరికి లక్షల్లో రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. 

Updated Date - 2020-12-15T15:40:15+05:30 IST

Read more