చిరు 153లో హీరోయిన్ ఉంటుందా?

ABN , First Publish Date - 2020-04-25T16:56:54+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఆగిన ఈ చిత్రం... ఆ ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేస్తారు.

చిరు 153లో హీరోయిన్ ఉంటుందా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఆగిన ఈ చిత్రం... ఆ ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేస్తారు. ఈ సినిమా త‌ర్వాత మ‌లయాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ పాత్ర‌కు హీరోయిన్ ఉండ‌దు. కానీ చిరంజీవి ఇమేజ్, ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెలుగులో హీరోయిన్ ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నార‌ట‌. ‘సాహో’ ద‌ర్శ‌కుడు సుజిత్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. మ‌రో నాలుగైదు రోజుల్లో సుజిత్‌తో చిరంజీవి వీడియో కాల్‌లో స్క్రిప్ట్‌కు సంబంధించిన చ‌ర్చ జ‌రుపుతార‌ట‌. రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌రో నిర్మాత ఈ రీమేక్‌ను నిర్మిస్తార‌ని టాక్. 

Updated Date - 2020-04-25T16:56:54+05:30 IST