జగ్గూ భాయ్‌లా ఈ హీరో విలన్‌గా మెప్పిస్తాడా?

ABN , First Publish Date - 2020-02-04T01:19:14+05:30 IST

హీరోగా అవకాశాలు తగ్గిపోయిన వారందరూ ఇప్పుడు విలన్‌ వేషాల మీద పడ్డారు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం విలన్‌గా

జగ్గూ భాయ్‌లా ఈ హీరో విలన్‌గా మెప్పిస్తాడా?

హీరోగా అవకాశాలు తగ్గిపోయిన వారందరూ ఇప్పుడు విలన్‌ వేషాల మీద పడ్డారు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం విలన్‌గా అదరగొడుతుండగా, ఆయన్నే మరో హీరో ఫాలో అయిపోనున్నారు. ఆ హీరో ఎవరో కాదు శ్రీకాంత్‌. కుటుంబ కథా చిత్రాల హీరోగా బోలెడంత పేరు సంపాదించిన శ్రీకాంత్‌కి ఇటీవలి కాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. అమాయకమైన ముఖంతో కనిపించే శ్రీకాంత్‌ని విలన్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన బోయపాటికి వచ్చిందట. ఇంకేముంది? ఆలోచన రావడం తరువాయి తన తరువాతి సినిమాలో శ్రీకాంత్‌ని విలన్ని చేసేశారని, తన తర్వాత సినిమాలో శ్రీకాంత్‌కి బోయపాటి విలన్ పాత్ర ఇచ్చాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 


గతంలో జగపతిబాబులోని విలనిజాన్ని సినీలోకానికి పరిచయం చేసింది బోయపాటే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీకాంత్‌ని పరిచయం చేయబోతున్నారు. జగపతిబాబులాగా శ్రీకాంత్‌ కూడా విలనిజంలో అదరగొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారట. మరి శ్రీకాంత్ విలనిజం ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Updated Date - 2020-02-04T01:19:14+05:30 IST