పవన్ సినిమాలో రానా కాదు.. ఎవరంటే?

ABN , First Publish Date - 2020-10-28T03:37:14+05:30 IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ.. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 'వకీల్‌ సాబ్‌' సినిమా సెట్స్‌పై ఉండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా

పవన్ సినిమాలో రానా కాదు.. ఎవరంటే?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ.. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 'వకీల్‌ సాబ్‌' సినిమా సెట్స్‌పై ఉండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ దశమి కానుకగా.. పవన్ కల్యాణ్ మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 'కింగ్ ఆఫ్‌ యాటిట్యూడ్‌. .. తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హై ఓల్టేజ్‌ రోల్‌తో మరోసారి రాబోతున్నారు' అంటూ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇవి కాకుండా.. ఇటీవల బండ్ల గణేష్‌ కూడా నా దేవుడు మరోసారి వరమిచ్చాడంటూ హడావుడి చేశాడు. మంచి కథ దొరికితే.. బండ్ల నుంచి మరో ప్రాజెక్ట్ ప్రకటన రావచ్చు. 


ఇక తాజాగా ప్రకటించిన పవన్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ మూవీపై సోషల్‌ మీడియాలో అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్‌ అని, వకీల్‌ సాబ్‌ తర్వాత పవన్‌ ఈ చిత్రంలోనే నటించనున్నాడని అంటున్నారు. అలాగే పవన్‌తో పాటు రానా కూడా ఈ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో రానా నటించడం లేదని, పవన్‌ భక్తుడు నితిన్‌ని ఆ పాత్ర కోసం అనుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నితిన్‌ బిజీ హీరోగా మారిపోయాడు. అదే బ్యానర్‌లో ఇప్పుడు తన దేవుడితో కలిసి నటించే అవకాశం వస్తే.. నితిన్‌ ఎగిరి గంతేయడం ఖాయం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-28T03:37:14+05:30 IST