రేపే హీరో నిఖిల్ పెళ్లి..!

ABN , First Publish Date - 2020-05-13T18:50:23+05:30 IST

యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి రేపటికి(మే 14) జరుగుతుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నిఖిల్‌, డాక్ట‌ర్ ప‌ల్ల‌వివ‌ర్మ‌ను ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సింది.

రేపే హీరో నిఖిల్ పెళ్లి..!

యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి రేపటికి(మే 14) జరుగుతుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నిఖిల్‌, డాక్ట‌ర్ ప‌ల్ల‌వివ‌ర్మ‌ను ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సింది. అయితే క‌రోనా ప్ర‌భావంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. త‌ర్వాత మే 14న పెళ్లిని నిర్ణ‌యించారు. కానీ మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగించ‌డంతో పెళ్లి వాయిదా వేసుకునే ఆలోచ‌న‌లోఉన్న‌ట్లు నిఖిల్ తెలిపారు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు హీరో నిఖిల్ పెళ్లి రేపు హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని ఫామ్‌హౌస్‌లో ఈ పెళ్లి జ‌ర‌గ‌నుందట‌. ఈ పెళ్లికి ప‌ర‌మిత సంఖ్య‌లో బంధువులు, శ్రేయోభిలాషులు హ‌జర‌వుతార‌ని స‌మాచారం. 

Updated Date - 2020-05-13T18:50:23+05:30 IST