హీరోయిన్ మెహ‌రీన్‌ను ఇబ్బంది పెట్టిన హీరో తండ్రి..?

ABN , First Publish Date - 2020-02-21T22:23:27+05:30 IST

ఈ ఏడాది హీరోయిన్ మెహరీన్ న‌టించి విడుద‌లైన చిత్రాల్లో `అశ్వ‌థ్థామ` ఒక‌టి. ఈ సినిమాలో నాగ‌శౌర్య హీరో. ఆయ‌న తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా.. త‌ల్లి ఉష నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

హీరోయిన్ మెహ‌రీన్‌ను ఇబ్బంది పెట్టిన హీరో తండ్రి..?

ఈ ఏడాది హీరోయిన్ మెహరీన్ న‌టించి విడుద‌లైన చిత్రాల్లో `అశ్వ‌థ్థామ` ఒక‌టి. ఈ సినిమాలో నాగ‌శౌర్య హీరో. ఆయ‌న తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా.. త‌ల్లి ఉష నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర‌కు ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోలేదు. ఈ సంగ‌తిని పక్క‌న పెడితే..సోష‌ల్ మీడియాలో ఓ వార్తొక‌టి చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే `అశ్వ‌థ్థామ‌` ప్ర‌మోష‌న్స్‌లో ఓ కార్య‌క్ర‌మానికి మెహ‌రీన్ హాజ‌రు కావాల్సి ఉంది. కానీ ఆమెకు అల‌ర్జీ సోక‌డంతో తాను స‌ద‌రు ప్రోగ్రామ్‌కు హాజ‌రు కాలేన‌ని శంక‌ర్ ప్ర‌సాద్‌కు చెప్పింది. అయితే శంక‌ర్ ప్రసాద్ వినిపించుకోకుండా.. ప్రోగ్రామ్‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. రాక‌పోతే హోట‌ల్ బిల్స్ పే చేయ‌న‌ని బెదిరించాడ‌ట‌. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో చెప్ప పెట్ట‌కుండా హోట‌ల్ ఖాళీ చేసి వెళ్లిపోయింద‌ట‌. దాంతో హోట‌ల్ యాజ‌మాన్యం శంక‌ర్ ప్ర‌సాద్‌కు ఫోన్ చేసి అస‌లు విష‌యం చెప్ప‌డంతో శంక‌ర్ ప్ర‌సాద్ బిల్లు క‌ట్ట‌క  త‌ప్ప‌లేద‌ట‌. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై స‌ద‌రు నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Updated Date - 2020-02-21T22:23:27+05:30 IST