అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిన గోపీచంద్.. కారణమిదే

ABN , First Publish Date - 2020-08-25T03:26:42+05:30 IST

మాములుగా అయితే ఒక సినిమా మధ్యలో ఆగిపోతే.. అప్పటికే ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్న హీరోలు.. ఆ అడ్వాన్స్‌ను తిరిగి నిర్మాతకు ఇవ్వడం అనేది రేర్‌గా

అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిన గోపీచంద్.. కారణమిదే

మాములుగా అయితే ఒక సినిమా మధ్యలో ఆగిపోతే.. అప్పటికే ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్న హీరోలు.. ఆ అడ్వాన్స్‌ను తిరిగి నిర్మాతకు ఇవ్వడం అనేది రేర్‌గా జరుగుతుంటుంది. అయితే తాజాగా టాలీవుడ్‌లోని ఓ హీరో తనతో అనుకున్న సినిమా ఆగిపోవడంతో.. అడ్వాన్స్‌గా తీసుకున్న రూ. 2 కోట్ల రూపాయలను నిర్మాతకి ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు యాక్షన్ హీరో గోపీచంద్.


ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్‌తో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రం చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయినట్లుగా సమాచారం. అందుకే హీరో గోపీచంద్ ఈ చిత్రం కోసం తీసుకున్న రెండు కోట్ల రూపాయల అడ్వాన్స్‌ను నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు తిరిగి ఇచ్చేశారని అంటున్నారు.

Updated Date - 2020-08-25T03:26:42+05:30 IST