‌‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ రీమేక్‌లో హీరో అతనేనా?

ABN , First Publish Date - 2020-04-20T01:53:30+05:30 IST

టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఇప్పుడు ఇతర సినిమా ఇండస్ట్రీలన్నీ ఆ సినిమాపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. విడుదలైన సినిమాలకు బాక్సాఫీస్

‌‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ రీమేక్‌లో హీరో అతనేనా?

టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఇప్పుడు ఇతర సినిమా ఇండస్ట్రీలన్నీ ఆ సినిమాపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. విడుదలైన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తే చాలు వెంటనే ఫ్యాన్సీ ఆఫర్‌కి రీమేక్ రైట్స్  తీసేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణగా ఎన్నో సినిమాలను చెప్పుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఓ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం అతి త్వరలో బాలీవుడ్‌లో రీమేక్‌కు రెడీ అవుతుంది. 


ఈ చిత్ర బాలీవుడ్ రీమేక్ హక్కులను అశ్విన్ వర్దే పొందారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బన్నీ పాత్ర చేసే హీరో విషయంలో ఇప్పటికే ఎన్నో పేర్లు వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో చేసే హీరో ఫిక్స్ అయ్యాడంటూ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కార్తీక్ ఆర్యన్ ఈ స్ర్కిఫ్ట్ విన్న వెంటనే చేసేందుకు అంగీకారం తెలిపాడని, అతనే ఈ చిత్రంలో హీరోగా చేస్తాడనే న్యూస్‌ను చిత్రయూనిట్ త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనుందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-04-20T01:53:30+05:30 IST